రామానాయుడు స్టూడియో భూములు వెనక్కి తీసుకోవాలి 1 y ago
AP: విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకు గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్ చేశారు. స్టూడియో కోసం నగరంలో 35 ఎకరాల భూమి కేటాయించారని అసెంబ్లీలో ఆయన వెల్లడించారు. అందులోని 15.17 ఎకరాల్లో లేఅవుట్లు వేసి విక్రయించాలని గత ప్రభుత్వంలో ప్రయత్నించారని పేర్కొన్నారు. ఇన్నేళ్లలో ఆ భూమిని ఆ స్టూడియో కోసం వినియోగించుకోలేదని ఆరోపించారు.